శుక్రవారం పంచాంగం, రాశిఫలాలు (11-06-2021)

by  |
Panchangam
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి (నిన్న సాయంత్రం 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 28 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర (నిన్న ఉదయం 11 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 29 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 11 గం॥ 44 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 29 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 40 ని॥ నుంచి ఉదయం 6 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 18 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 41 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 33 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి 8 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 32 ని॥ నుంచి 5 గం॥ 10 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మిథునము

మేష రాశి : ఇంటి లోని కొన్ని ముఖ్య అవసరాలను గమనించవలసి ఉంది. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. మోసపూరిత పథకాలలో ఇన్వాల్వ్ కావద్దు ఇల్లు కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు. కొంతమందికి ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరిగిన మర్చిపోయి ఒకటవుతారు.

వృషభ రాశి : ఆర్థిక పరంగా పూర్తి పురోగతి. ధన సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లో సరైన నిర్ణయం తీసుకోండి. ఆఫీసు పనిలో నూతన బాధ్యతల వల్ల అధిక శ్రమ. దాని వలన తలనొప్పి. విజయసాధనలో వచ్చిన అవకాశాలను మీ శక్తిసామర్థ్యాల మేరకు ఉపయోగించుకోండి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. పనికిమాలిన విషయాల మీద సమయాన్ని వృధా చేయవద్దు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలకు శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి.

మిథున రాశి : ఈరోజు పనులు పూర్తి చేయడం కోసం సరైన ప్రణాళిక వేసుకోండి. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. శుభ కార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మీరు కొందాం అనుకుంటున్న స్థిరాస్తికి పోటీదారులు వస్తున్నారు. సంఘంలో పేరుప్రతిష్టలు. అవసరాలకు తగినంత ఆదాయం. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశం. ఆఫీస్ పని లో నూతన బాధ్యతల వలన ఒత్తిడి. అనవసరమైన ఖర్చులను నివారించండి. కంటి నొప్పి కి అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం, సహనము మీ విజయానికి మార్గాలు. నిరాశ వాదాన్ని వదిలేయండి.ఇది మీ అభివృద్ధికి అడ్డంకి. అవసరాలకు మించిన ఆదాయము పొదుపు చేయండి. ముఖ్యమైన పనులకు ప్రణాళిక తప్పనిసరి. కొంతమందికి వంశ పారంపర్యంగా స్థిరాస్తి లాభం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి.

సింహ రాశి : ఆత్మవిశ్వాసము మరియు పట్టుదలతో అన్ని కార్యాలను పూర్తి చేస్తారు. జల్సా, దుబారా ఖర్చు ల వలన ఎంత ధనం వ్యర్థం అయిందో గుర్తిస్తారు. మీ బాధ్యతారాహిత్యం మీ తల్లిదండ్రులను బాధిస్తుంది. ఆఫీసులో అప్పగించిన అదనపు బాధ్యతలను సామర్ధ్యంతో పూర్తి చేస్తారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీరు కుటుంబం కోసం పడుతున్న శ్రమను నిజాయితీగా గుర్తించడం మీకు సంతోషాన్ని ఇస్తుంది.

కన్యా రాశి : ఇంటి మరమ్మత్తులకు డబ్బు ఖర్చు చేస్తారు. కొంతమందికి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం. స్థిరాస్తి కొనుగోలుకు ఎంతోకాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలు సఫలం. సరైన సమయమునకు సరైన భోజనం ఆరోగ్యానికి చిహ్నం. అవసరాలకు మించి ధనలాభం పొదుపు చేయండి. కొంతమందికి విదేశాలకు వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం మీకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులా రాశి : అవసరాలకు సరిపడా ఆదాయం. ధన సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. గందరగోళం వదిలేయండి. సహనంతో ఉండండి. సభలలో గౌరవం. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం వలన లాభం లేదు. ఆఫీసు పనిలో నూతన బాధ్యతలు వలన పనులు పూర్తి అవడానికి అధిక శ్రమ పడవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో పాత గొడవల విషయం ఎత్తకండి. దానివలన ఆయన మరింత మొండి వారవుతారు.

వృశ్చిక రాశి : సహనంతో పనులు పూర్తి చేస్తారు. దైవప్రార్థనల వలన మరింత శక్తి వస్తుంది. ఆఫీసు పనిలో నూతన బాధ్యతల వల్ల అధిక శ్రమ. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. ప్రయాణాలలో వస్తువులు డబ్బులు జాగ్రత్త. ఎలర్జీ వలన చర్మ సంబంధ వ్యాధులు. బంగారం వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు. ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త అనారోగ్యం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది.

ధనుస్సు రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో కార్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో పోటీదారులను మించి ఆలోచించండి. పాత పెట్టుబడులు మరింత లాభాలను తెస్తాయి స్నేహితులతో, ఆత్మీయులతో బంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యమే మహాభాగ్యము. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆఫీసు పనిలో తోటి ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు పై అధికారుల మెప్పు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు. దీనివలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. మీరు ఊహించిన ధరకు ఒక స్థిరాస్తి మీకు దొరికే అవకాశం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. ఫిట్నెస్ మీద శ్రద్ధ కనబరుస్తారు. కొంత కాలంగా వేధిస్తున్న అనారోగ్యం దూరం అవుతుంది. ఆఫీసులో పనులను అనుకున్న విధంగా త్వరగా పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఆహ్లాదకర వాతావరణం.

కుంభరాశి : మీరు ఊహించిన ధరకు ఒక స్థిరాస్తి మీకు దొరికే అవకాశం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. హడావిడి ప్రయాణాల వలన ఇబ్బంది. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. అవసరాలకు మించి ధనాదాయం పొదుపు చేయండి. కొన్ని అనుకోని ఖర్చులు. పనులలో ఒత్తిడిని అధిగమించండి. దైవ ప్రార్థనల వలన లాభం. కొన్ని విషయాలపై భార్యతో వాదోపవాదాలు మిమ్మల్ని అశాంతికి గురి చేస్తాయి. పిల్లల చదువులకు ఖర్చు పెడతారు. ఊహలను వదిలి వాస్తవంలోకి రండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ భర్త ప్రవర్తన మీ పాత గొడవలు మరిచిపోయేలా చేస్తుంది.

మీన రాశి : అడ్డంకులు ఎదురైనా అనుకున్న కార్యాలను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. బయటి భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసు పనిలో మీ నిరంకుశ ధోరణి మీ తోటి ఉద్యోగులను బాధేస్తోంది. కొంతమంది ఇంటి మరమ్మతులపై ఖర్చు చేస్తారు. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందాల్లో ముంచెత్తుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్య సంభాషణ మిమ్మల్ని ఆనంద ఆశ్చర్యానికి గురి చేస్తుంది.


Next Story

Most Viewed