- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామన్నపేటలో విషాదం.. స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆంగ్లేయుల కాలంలో అనేక పోరాటాల్లో పాల్గొన్న ఆయన మృతిని రామన్నపేట మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రామన్నపేట మండలంలో జెడ్పీటీసీగా పనిచేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆంగ్లేయుల కాలంలో అనేక పోరాటాల్లో పాల్గొన్న ఆయన మృతిని రామన్నపేట మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రామన్నపేట మండలంలో జెడ్పీటీసీగా పనిచేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. ఆయన మరణవార్త తెలిసిన వివిధ పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Next Story






