మోసాల టీచర్.. చీటింగ్‌లో టాపర్

147
arrest

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మోసాలు వెలుగు చూశాయి. అమాయకులకు ఇళ్ల ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు దండుకున్నాడు. రమణబాబు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ చీటింగ్‌కు పాల్పడ్డాడు. బాధితుల నుంచి రూ.19 లక్షలను అడ్వాన్స్ గా తీసుకుని ముఖం చాటేశాడు. అటు ప్లాట్లు ఇవ్వాక.. ఇటు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఉపాధ్యాయుడు రమణ బాబుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రమణ బాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ ఉపాధ్యాయుడు గతంలోనూ అదే తరహ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై నర్సీపట్నం పీఎస్‌లో కేసు నమోదైనట్లు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..