- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTPC ఫోర్ మెన్ మిస్సింగ్.. అంతుచిక్కని పజిల్..?
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓ అధికారి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆయన ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్లాడు.. అన్నదే పజిల్‌గా మారింది. పోలీసులు సదరు అధికారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనా వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్రాజెక్టులో ఫోర్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపేంద్రనాథ్ రాయ్ మిస్సయ్యారు. విధులు నిర్వర్తించేందుకు యథావిధిగా సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య […]</p>

X
దిశ, గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓ అధికారి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆయన ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్లాడు.. అన్నదే పజిల్‌గా మారింది. పోలీసులు సదరు అధికారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనా వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్రాజెక్టులో ఫోర్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపేంద్రనాథ్ రాయ్ మిస్సయ్యారు. విధులు నిర్వర్తించేందుకు యథావిధిగా సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పింకీ రాయ్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
Next Story






