మసాలా ప్యాకెట్స్‌లో భారీగా డ్రగ్స్..

6

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పసుపు, సాంబారు, ఉప్పు, మసాలా ప్యాకెట్లలో ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ దూర్చి అక్రమంగా తరలిస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

తమిళనాడు నుంచి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. రూ.30లక్షల విలువ చేసే 3కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.