- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తౌటే తుఫాన్ బీభత్సం.. నలుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు తౌటే తుఫాన్ పెను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా తీర ప్రాంత రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. ఈ తుఫాన్ కారణంగా కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి చిక్కమంగళూరు, ఉడిక్కి జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కర్ణాటకలో 112 ఇళ్లు, 139 విద్యుత్ స్తంభాలు, 22 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా అప్రమత్తమైన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు తౌటే తుఫాన్ పెను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా తీర ప్రాంత రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. ఈ తుఫాన్ కారణంగా కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి చిక్కమంగళూరు, ఉడిక్కి జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
వర్షాల కారణంగా కర్ణాటకలో 112 ఇళ్లు, 139 విద్యుత్ స్తంభాలు, 22 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా అప్రమత్తమైన అధికార యంత్రాంగం తీరప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దింపింది. ఈ సందర్భంగా అధికారులతో సీఎం యడియూరప్ప సమావేశం అయ్యారు. సహాయక చర్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలిపారు. దాదాపు 73 గ్రామాలు సహా 7 జిల్లాల్లోని 17 తాలుకాలపై తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






