బతుకమ్మ విగ్రహావిష్కరణ.. శాయంపేటలో కోలాహలం

by  |

దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రకృతిలో పువ్వులు, మన సంసృతిలోని నవ్వులు కలబోస్తూ ఆడపడుచుల్లో బతుకమ్మ చిరునవ్వులు కలగాలని కోరుకున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ వ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ కో-ఆప్షన్ మెంబర్ షేక్ గౌస్, సర్పంచ్ వనమ్మవీరస్వామి, ఉప సర్పంచ్ జోయి, మాజీ సర్పంచ్ భాస్కర్, సీనియర్ నాయకులు అలీషా, తమాస్, ఎర్రం మోగిలి, నాలిక రవి, తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story