- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలోకి రాములమ్మ.. 14న ఢిల్లీకి పయనం!
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి కషాయకండువా కప్పుకుంటారనే ప్రచారం మళ్లీ జోరందుకుంది. అయితే, బైపోల్‌కు ముందుగానే విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపిన విషయం తెలిసిందే. కాగా, దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో మళ్లీ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 14న ఢిల్లీకి విజయశాంతి పయనం అవుతున్నారు.దీంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి కషాయకండువా కప్పుకుంటారనే ప్రచారం మళ్లీ జోరందుకుంది. అయితే, బైపోల్‌కు ముందుగానే విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపిన విషయం తెలిసిందే.
కాగా, దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడంతో మళ్లీ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 14న ఢిల్లీకి విజయశాంతి పయనం అవుతున్నారు.దీంతో ఆమె కషాయకండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.కాగా, ఆమె పార్టీలో చేరే అంశంపై ఇంకా చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు.
Next Story






