కేసీఆర్‌ యూటర్న్‌పై.. పొంగులేటి క్లారిటీ

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ కీలక నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ&#8230; సాగుచట్టాల గురించి చదువుకోవడం వల్లే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని [&hellip;]</p>

Former MP Ponguleti Srinivas Reddy, CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ కీలక నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సాగుచట్టాల గురించి చదువుకోవడం వల్లే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాకుండా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story