- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు.. భగ్గుమన్న చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా బి.శివలింగపురంలో టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణ పడ్డారు. ఈ కేసులో చింతమనేనిని అరెస్టు చేసి 341,324,143,323,354,171సీ,506 రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేయించారు.కాసేపట్లో చింతమనేనిని జడ్జి ఎదుట హాజరుపరుచనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, చింతమనేని అరెస్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా బి.శివలింగపురంలో టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణ పడ్డారు. ఈ కేసులో చింతమనేనిని అరెస్టు చేసి 341,324,143,323,354,171సీ,506 రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేయించారు.కాసేపట్లో చింతమనేనిని జడ్జి ఎదుట హాజరుపరుచనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, చింతమనేని అరెస్టు పట్ల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాతీర్పు సహించలేకే ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని విమర్శించారు. తక్షణమే చింతమనేనిని విడుదల చేయాలని చంద్రబాబు మండిపడ్డారు.
Next Story






