- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్‌పై పత్తిపాటి పుల్లారావు ఫైర్.. ఎందుకంటే?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తోందని ఆరోపించారు. చివరికి ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా జైల్లో పెడుతున్నారంటూ ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కొండపల్లిలో అటవీ ప్రాంతంలో జరుగుతోన్న అక్రమాల పరిశీలనకు వెళ్తే ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. ఫారెస్ట్‌లో అక్రమాలు జరగడం లేదన్న ప్రభుత్వం మరి తమనేతలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తోందని ఆరోపించారు. చివరికి ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా జైల్లో పెడుతున్నారంటూ ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కొండపల్లిలో అటవీ ప్రాంతంలో జరుగుతోన్న అక్రమాల పరిశీలనకు వెళ్తే ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. ఫారెస్ట్‌లో అక్రమాలు జరగడం లేదన్న ప్రభుత్వం మరి తమనేతలు అక్కడ పర్యటించేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటుందని నిలదీశారు. చిలకలూరి పేటలో వందల లారీల మట్టి, ఇసుక తరలిపోతోందని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.
Next Story






