అఖిలప్రియకు 300ల ప్రశ్నలు.. అంతా ప్లాన్ ప్రకారమే!

141

దిశ, వెబ్‌డెస్క్ : బోయిన్ పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసు ఉదంతంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కస్టడీ ఎట్టకేలకు ముగిసింది. మూడు రోజుల విచారణలో భాగంగా పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ముందుగా ఆమెకు 300ల ప్రశ్నలను సంధించారు. అందులో భాగంగానే ఆమె నిజాలను బయటపెట్టింది. ప్రవీణ్ రావు మరియు అతని సోదరుల కిడ్నాప్‌నకు ముందు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ రెక్కి నిర్వహించినట్లు తేలింది. అందుకోసం అతను కూకట్ పల్లిలోని ఓ లాడ్జ్‌లో బస కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కిడ్నాప్‌నకు కొద్ది సమయం ముందు భార్గవ్ కారులో వెళ్లి.. ముగ్గురు సోదరులను చిలుకూరు ఫామ్ హౌస్‌లో బంధించారు.

ఆ తర్వాత నవీన్, సునీల్‌తో డాక్యుమెంట్స్‌పై సంతకాలు తీసుకున్నారని సమాచారం. డాక్యుమెంట్స్‌పై ఆళ్లగడ్డ అని ఉండటంతో ప్రవీణ్ రావు సంతకం చేయడానికి నిరాకరించాడు. ఆ వెంటనే కిడ్నాప్ వ్యవహారం పో లీసులకు తెలిసిందంటూ అఖిలప్రియ కాల్ చేసి నిందితులను అలెర్ట్ చేసింది. దాంతో తమ వద్ద బంధీలుగా ఉన్న ముగ్గురిని మొయినాబాద్‌లో కిడ్నాపర్లు వదిలేసినట్లు విచారణలో వెల్లడైంది.