రైతులు నిరసనలు చేయడం బాధగా ఉంది : యువరాజ్

by Shamantha N |   (  Updated:2020-12-12 11:30:17  IST  )

<p>దిశ, స్పోర్ట్స్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. శుక్రవారం 39వ జన్మదినం జరుపుకుంటున్న యువీ.. ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని విడుదల చేశాడు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చలు జరిపి.. వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరాడు. &#8216;పుట్టిన రోజులు అంటే మన కోరికలను లేదా లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వచ్చే అవకాశాల వంటివి. అయితే ఈ సారి [&hellip;]</p>

రైతులు నిరసనలు చేయడం బాధగా ఉంది : యువరాజ్
X

దిశ, స్పోర్ట్స్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. శుక్రవారం 39వ జన్మదినం జరుపుకుంటున్న యువీ.. ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని విడుదల చేశాడు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చలు జరిపి.. వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరాడు. ‘పుట్టిన రోజులు అంటే మన కోరికలను లేదా లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి వచ్చే అవకాశాల వంటివి. అయితే ఈ సారి నా పుట్టిన రోజు నాడు సంబురాలు చేసుకోవడానికి కంటే రైతుల సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజున దేశానికి వెన్నుముక అయినటువంటి రైతులు రోడ్డుమీదకు వచ్చి, రోజుల తరబడి నిరసనలు చేయడం బాధగా ఉందని, ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చలు జరపాలి’ అని యువరాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ఇక రైతుల పోరాటానికి మద్దతు తెలిపిన యువరాజ్ తన తండ్రి యోగరాజ్ వ్యాఖ్యలతో విభేదించాడు. రైతుల పోరాటానికి మద్దతుగా క్రీడాకారులు తమకు వచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చేయాలని యోగరాజ్ డిమాండ్ చేశాడు. అయితే తన తండ్రి వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు చెప్పాడు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమైనవని అన్నాడు. తాను రైతు పోరాటానికి మద్దతు పలుకుతున్నాను కానీ తన తండ్రి వ్యాఖ్యలకు కాదని చెప్పాడు. కాగా, యువరాజ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story