విరాట్ లేకపోతే.. టీమిండియాకు ఇబ్బందే

by  |
విరాట్ లేకపోతే.. టీమిండియాకు ఇబ్బందే
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగించుకొని టీమిండియా నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టూర్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో తలపడనుంది. ఈ క్రమంలో తొలి టెస్టు తర్వాత మిగతా మూడు టెస్టులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై పాంటింగ్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ లేకపోతే టీమిండియా ఇబ్బంది పడుతుందని అభిప్రాయపడ్డారు. కోహ్లీ బ్యాటింగ్, కెప్టెన్సీ లేకపోవడం ఇండియాకు లోటు అని వెల్లడించారు. అంతేగాకుండా కోహ్లీ స్థానంలో ఇంకెవరు వచ్చినా… అది వారిపై ఒత్తిడి పెంచుతుందని అభిప్రాయపడ్డారు. నెగ్గుకురావడం కష్టంగా మారుతుందని అన్నారు.


Next Story

Most Viewed