- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాకీ పేల్చిన మాజీ ఆర్మీ అధికారి.. ఎక్కడంటే!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఓ మాజీ ఆర్మీ అధికారి తుపాకీ పేల్చాడు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. రాయవరానికి చెందిన ఆర్మీ అధికారి సాంబశివరావు పొలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఇదే విషయమై వివాదం తలెత్తగా, సహనం కోల్పోయిన మాజీ అధికారి ప్రత్యర్థులపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు మృతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓ మాజీ ఆర్మీ అధికారి తుపాకీ పేల్చాడు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. రాయవరానికి చెందిన ఆర్మీ అధికారి సాంబశివరావు పొలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఇదే విషయమై వివాదం తలెత్తగా, సహనం కోల్పోయిన మాజీ అధికారి ప్రత్యర్థులపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
Next Story






