ఐదేళ్ల పాపను కూడా వదలారా..?

by  |
Any Master
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హౌస్‌లో ఉన్న వారిపై చేస్తున్న బోల్డ్ కామెంట్స్‌తో ఆ షో మరింత ఫోకస్ అయ్యేలా చేస్తోంది. ఈ వారం ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమె సోషల్ మీడియాతో ముచ్చటిస్తూ ఒక నీచమైన పనిపై ఫైర్ అయ్యారు. చిన్న పిల్లలపై అసభ్యకర రీతిలో ట్రోలింగ్ చేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల యాంకర్ రవి భార్య నిత్యను వాళ్ల ఐదేళ్ల కూతురు వియూను కూడా చాలా మంది అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఆనీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నవారికి వార్నింగ్‌ ఇచ్చారు. “నేను రవి భార్య నిత్యతో మాట్లాడాను. ఆమె కూతురు వియూ వీడియోల కింద బ్యాడ్‌ కామెంట్లు పెడుతున్నారంట! ఐదేళ్ల చిన్న పాపండీ.. ఇది కరెక్ట్‌ కాదు. మేమంటే భరిస్తాం కానీ చిన్నపిల్లల వీడియోల మీద ఎందుకిలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత ద్వేషం? అసలు నాకు బుద్ధి లేదా? మీకు బుద్ధి లేదా? వియు వీడియోలకు చెడ్డ కామెంట్లు చేయడం ఆపండి అని ఆనీ మాస్టర్ హెచ్చరించింది.

ఇక హౌస్ లో ఉన్నప్పుడు తనపై జరిగిన ట్రోలింగ్ పై కూడా ఆమె గట్టిగానే రియాక్టయ్యారు. మీరు అసలు మనుషులేనా. 11వారాలుగా అందరిని గమనిస్తూనే ఉన్నారుగా.. ఒక మనిషిని హౌస్ లో ఒకడు అమ్మేస్తా అంటే తప్పు కాదా.. అప్పడం అయిపోతావని మహిళని తిట్టడం కరెక్టేనా.. వారంతా అన్ని తప్పులు చేస్తుంటే.. నేను డాన్స్ చేస్తే మాత్రం బండ బూతులు తిడతారా.. మీరు వారి ఫాలోవర్స్ అయి ఉండొచ్చు.. వారు చేసిందల్లా మీకు కరెక్ట్ అనిపించొచ్చు.. కానీ మిగితా వారు తప్పుచేయకపోయినా కించపరచడం మంచిది కాదు” అంటూ స్పందించింది ఆనీ మాస్టర్.



Next Story

Most Viewed