- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పులి దాడి ఘటనతో అటవీశాఖ అలర్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం జిల్లాలో పులి దాడిలో యువకుడు మృతి నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. పులిని బందించేందుకు అటవీ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారం ఉన్న దిగడ, పెంచికల్ పేట అటవీ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. దహేగం, బెజ్జూరు, కాగజ్ నగర్‌తో పాటు మంచిర్యాల జిల్లాలో మొత్తం 11 పులులు తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దహేగం మండలం దిగడలో పులి దాడిలో విఘ్నేష్ అనే యువకుడు మృతి చెందిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం జిల్లాలో పులి దాడిలో యువకుడు మృతి నేపథ్యంలో అటవీశాఖ అప్రమత్తమైంది. పులిని బందించేందుకు అటవీ, పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారం ఉన్న దిగడ, పెంచికల్ పేట అటవీ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. దహేగం, బెజ్జూరు, కాగజ్ నగర్‌తో పాటు మంచిర్యాల జిల్లాలో మొత్తం 11 పులులు తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
దహేగం మండలం దిగడలో పులి దాడిలో విఘ్నేష్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుడి శరీరంపై ఉన్న గోర్ల ఆధారంగా మగపులిగా అధికారులు నిర్ధారించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story






