బంగారం, ఫారిన్ సిగరేట్లు పట్టివేత.. ఎక్కడంటే!

by  |
బంగారం, ఫారిన్ సిగరేట్లు పట్టివేత.. ఎక్కడంటే!
X

దిశ, రాజేంద్రనగర్ : విదేశాల నుంచి బంగారం, విదేశీ సిగరెట్లు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. రెండు వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో ఓ మహిళ, మరో వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అంత్తుల్ అర్షియా హాసినిల్ రమ్మీ అనే మహిళ ప్రయాణికులుపై అనుమానం వచ్చి కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆమె బ్యాగ్ లో రూ. 74 లక్షల విలువచేసే ఒక కిలో 593 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మహిళను అదుపులోకి తీసుకొని అని గతంలో ఆమెపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నామని చెప్పారు. మరో ఘటనలో అబుదాబి నుంచి వచ్చిన అబ్దుల్ ఎజాజ్ అనే ప్రయాణికుడు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగులో వివిధ దేశాలకు సంబంధించిన 150 ప్యాకెట్లు, 50 స్పెషల్ గోల్డ్ సూపర్ ఫైన్ ప్యాకెట్లు 40 వేల సిగరెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అబ్దుల్ ఎజాజ్ ను కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులకు సీఐఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు.



Next Story