ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం నాని సమ్‌థింగ్ స్పెషల్

by  |
ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం నాని సమ్‌థింగ్ స్పెషల్
X

దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయం అందక చాలా మంది పేషెంట్లు మరణించగా.. సరైన చికిత్స అందినప్పటికీ భయంతో చనిపోయిన వారూ ఉన్నారు. ఈ మేరకు కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్న హెల్త్ వర్కర్స్.. పేషెంట్లలో ఆత్మ స్థైర్యం పెంచేందుకు ఆస్పత్రుల్లో డ్యాన్స్‌లు చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పాపులర్ కాగా, ఎంతో మందిలో ధైర్యం నింపాయనడంలో సందేహం లేదు. అలాంటి ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం ఏదో ఒకటి చేయాలని భావించిన నేచురల్ స్టార్ నాని.. సమ్‌థింగ్ స్పెషల్‌తో త్వరలోనే ముందుకు రాబోతున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఈ మేరకు మ్యూజిక్, స్టెతస్కోప్ సింబల్స్‌తో పాటు హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఈ ఇండికేషన్‌ను బట్టి డాక్టర్లకు సంబంధించి స్పెషల్ సాంగ్‌ను రూపొందిస్తున్నాడనే విషయం అర్థమవుతుండగా.. అదేంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Next Story

Most Viewed