నిబంధనలు బేఖాతరు.. ఆసుపత్రులకు రూ. 15 లక్షలు జరిమానా

53

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కొవిడ్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. విజయవాడలోని నాలుగు ఆసుపత్రులకు కలిపి రూ. 15 లక్షలు జరిమానా వేశారు. నగరంలోని సన్‌రైజ్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు, ప్రజ్ఞ ఆసుపత్రి, లిబర్టీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు, నూజివీడు వెంకటేశ్వర ఆసుపత్రికి రూ. 3 లక్షలు జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..