పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

by Disha Web Desk 15 |
పార్లమెంట్  ఎన్నికల  నామినేషన్ల పరిశీలన పూర్తి
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ పార్లమెంటు స్థానానికి వచ్చిన నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి 53 మంది అభ్యర్థుల నామినేషన్ ఆమోదించినట్టు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా సమీర్ మాధవ్ కుర్త్కోటి, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం నామినేషన్ పరిశీలన చేపట్టగా పలు పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ కు 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 53 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఒక నామినేషన్ తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆర్ఓ కార్యాలయంలో స్క్రూటినీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. స్క్రూటినీ లో అవలంబించనున్న విధానాలను నామినేషన్ వేసిన అభ్యర్థులకు తెలియజేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అభ్యర్థులకు సూచించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 25 వరకు కొనసాగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 54 మంది అభ్యర్థులు

నామినేషన్ దాఖలు చేయగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కళ్లు నరసింహులు గౌడ్ ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త ఓటర్ల లిస్టు, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, ప్రపోజల్స్ సరైన పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించినట్టు తెలిపారు. 53 మంది నామినేషన్లను ఆమోదించినట్టు చెప్పారు. ఈరోజు 5 గంటల తర్వాత నుండి ఉపసంహరణ ఫామ్ సబ్​మిట్ అవకాశం ఇచ్చారు. తరువాత 29న సోమవారం సబ్మిట్ చేయాలని సూచించారు. అభ్యర్థి వ్యయానికి సంబంధించిన పుస్తకాలు అభ్యర్థులకు అందజేశామని, నామినేషన్ వేసిన అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని, సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. అభ్యర్థుల ఖర్చులు ఆ అకౌంట్ ద్వారానే నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ ఏజెంట్ రాండిమైజేషన్ ప్రక్రియలో హాజరుకావాలని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ స్టేషన్స్ కేటాయింపు చేయనున్నట్టు, ఈవీఎం రిలేటెడ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

హోమ్ ఓటింగ్ ప్రక్రియలో 85 సంవత్సరాలు దాటినవారు 40శాతం పైబడిన వికలాంగులకు ఫారం 12 డి అందజేస్తామని, ఏ రోజు ఎక్కడ హోమ్ ఓటింగ్ జరుగుతుందనే పూర్తి వివరాలు లిస్ట్ అందజేస్తామని, బూత్ లెవెల్ ఏజెంట్ హాజరై ఓటింగ్ ప్రక్రియను పరిశీలించవచ్చని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఆర్డీఓ నరసాపూర్, ఆర్డీఓ మెదక్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో పోస్టల్ ఓటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాన్ని పరిశీలించవచ్చని అన్నారు. క్రిమినల్ కేసుల వివరాలకి వస్తే ముగ్గురు అభ్యర్థులు రఘునందన్ రావు (బీజేపీ), నీలం మధు( కాంగ్రెస్), వెంకటరామిరెడ్డి (బీఆర్.ఎస్)పై ఉన్నాయని తెలిపారు. మూడుసార్లు న్యూస్ పేపర్లో వారికి ఇచ్చిన C1,C2,C3 ప్రొఫార్మాలు ప్రచురణ చేయాల్సి ఉంటుందని, దానికి సంబంధించిన తేదీలు కూడా వారికి నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసినప్పుడే చెప్పినట్టు తెలిపారు. ర్యాలీలు,

సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ఏఆర్ఓ నర్సాపూర్, ఏఆర్ఓ మెదక్ 48 గంటల ముందు అనుమతి కొరకు సువిధ పోర్టల్ లో దరఖాస్తు చేయవలసి ఉంటుందని, 24 గంటలు లోపు అనుమతి మంజూరు చేయనున్నట్టు చెప్పారు. అనుమతి లేకుండా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్త్కోటి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి రిటర్నింగ్ అధికారి తీసుకుంటున్న చర్యలు, చెక్పోస్టుల ద్వారా తనిఖీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల నమోదు క్షేత్ర స్థాయిలో పరిశీలించామని, ఇదే ఓరవడి కొనసాగించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed