కర్ణాటక బీజేపీ అభ్యంతరకర పోస్ట్‌ను తొలగించాలని ‘X’ కోరిన ఈసీ

by Disha Web Desk 17 |
కర్ణాటక బీజేపీ అభ్యంతరకర పోస్ట్‌ను తొలగించాలని ‘X’ కోరిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కర్ణాటకలో రిజర్వేషన్ల గురించి బీజేపీ తన ఎక్స్ హ్యండిల్‌లో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేయడంతో దానిని తొలగించాలని ఎన్నికల సంఘం మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Xని తాజాగా ఆదేశించింది. ఇంతకుముందు దానిని తొలగించాలని పార్టీని ఆదేశించిన అది తొలగించలేదు. దీంతో ఈసీ ఎక్స్‌ను సంప్రదించింది. రిజర్వేషన్లు, నిధుల కేటాయింపులో వెనుకబడిన తరగతుల కంటే ముస్లింలకు కాంగ్రెస్ అనుకూలంగా ఉందని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కార్టున్లతో కూడిన ఒక వీడియోను బీజేపీ తన ఎక్స్‌లో షేర్ చేసింది. దీనిపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రస్థాయిలో మండిపడింది. అలాగే బీజేపీ ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ అల్లర్లను రెచ్చగొట్టి శత్రుత్వాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అభ్యంతరకర పోస్ట్‌ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ, రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed