భారీ వర్షం: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరిక

by GSrikanth |
భారీ వర్షం: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విజృంభించింది. దీంతో ఎక్కడికక్కడ వరదనీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో పక్క ఈదురు గాలులతో కూడిన వర్షం కావడంతో పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు సైతం విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే విద్యుత్ వైర్లు తెగిపడి పలుచోట్లు కరెంట్ అంతరాయం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు పోలీసు శాఖ కీలక హెచ్చరిక చేసింది. ‘‘రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్‌లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయద్దు. శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి. అత్యవసర సమయాల్లో #Dial100 కు కాల్ చేయాలి’’ అని సూచనలు చేశారు.

Read More...

BREAKING: మండు వేసవిలోనూ హైదరాబాద్‌లో రికార్డు వర్షపాతం.. అత్యధికంగా ఆ ప్రాంతంలో నమోదుNext Story

Most Viewed