రెండు నెలల తర్వాత మళ్లీ మాల్దీవుల జలాల్లోకి చైనా సముద్ర పరిశోధన నౌక

by Dishanational1 |
రెండు నెలల తర్వాత మళ్లీ మాల్దీవుల జలాల్లోకి చైనా సముద్ర పరిశోధన నౌక
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో దౌతపరమైన విభేదాల నేపథ్యంలో మాల్దీవులకు డ్రాగన్ దేశం దగ్గరవుతోంది. ఇటేవలే చైనాకు చెందిన పరిశోధన నౌక రెండు నెలల క్రితం మాల్దీవుల జలల్లో గడిపింది. తాజాగా అదే నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి రావడం చర్చనీయాంసం అయింది. చైనా పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హంగ్-03 గురువారం ఉదయం తిలాఫుషీ ఇండస్ట్రియల్ హార్బర్‌లో డాక్ చేయబడింది. చైనా నౌక ఎందుకు వచ్చిందనే విషయంపై మాల్దీవుల ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సుమారు 4,500 టన్నుల బరువున్న చైనా పరిశోధన నౌక ఈ ఏడాది జనవరిలో మాల్దీవులకు చెందిన ఎకనమిక్ జోన్ సరిహద్దుల్లో ప్రయాణించింది. అనంతరం ఫిబ్రవరి మూడోవారంలో తిలాఫుషి పోర్టుకు చేరుకుని వారం రోజులు ఉండి తిరిగి వెళ్లింది. రెండు నెలల వరకు వివిధ పోర్టులకు వెళ్లిన ఆ నౌక మళ్లీ మాల్దీవులకు చేరింది. మొదటిసారి చైనా నౌక వచ్చిన సమయంలో మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి అనుమతిచ్చినట్టు ధృవీకరించారు. సిబ్బంది రొటేషన్ కొసం చైనా ప్రభుత్వం నుంచి దౌత్యపరమైన అభ్యర్థన వచ్చినందునే అనుమతిచామని పేర్కొన్నారు. అంతేకానీ చైనా నౌక ఎలాంటి పరిశోధన చేయదని వెల్లడించారు.



Next Story

Most Viewed