స్టాండ్స్‌లో ప్లేయర్.. ఏమిటా క్వారల్ !

by  |

ఓ వైపు మ్యాచ్ చేజారిన బాధ..మరోవైపు తన సోదరునితో గ్యాలరీలో ఓ ప్రేక్షకుడి వాగ్వాదం..ఇంకేం ఇదంతా చూసిన ఫుట్‌బాల్ ప్లేయర్‌‌కు టెంపర్ లేచింది. చూస్తుండగానే గ్రౌండ్‌లో నుంచి స్టాండ్‌లో తేలాడు. కామెంట్ చేసిన ఫ్యాన్‌పై యాంగర్ చూపాడు. ఈ సీనంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. ఎఫ్ఏ కప్ ఫుట్‌బాల్ లీగ్‌లో !

గురువారం తొట్టెన్‌హామ్, నార్విచ్ జట్ల మధ్య మ్యాచ్..నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 స్కోర్‌తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. తొట్టెన్ హామ్ జట్టు రెండు గోల్స్ చేయగా, నార్విచ్ జట్టు మూడు గోల్స్ చేసి విజేతగా నిలిచింది. కాగా అదే సమయంలో ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ తొట్టెన్‌హామ్ జట్టు ఆటగాడైన ఎరిక్ డయ్యర్ సోదరుడితో గొడవ పడ్డాడు. ఈ విషయంలోనే డయ్యర్ స్టాండ్స్‌లోకి దూసుకెళ్లాడు.

ఈ గొడవతో స్టేడియం రసాభసగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి డయ్యర్‌ను వెనక్కు పంపారు. అయితే ఈ విషయంలో జట్టు మేనేజర్ జోస్ మౌరీనో ఆటగాడిని వెనకేసుకొని వచ్చాడు. దీంతో ఆటగాడి తప్పేమీ లేదని.. ప్రేక్షకుడే అతిగా స్పందించాడని చెప్పుకొచ్చాడు.

tags : Football, FA Cup, Fan moment, Football Player Eric Dier

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed