హైదరాబాద్‌లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం

199

దిశ ప్రతినిధి, మేడ్చల్ : హైదరాబాదీ భోజన ప్రియుల కోసం నగరంలో ‘దవత్-ఎ-జాష్న్’ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ఆరంభమైంది. హైటెక్ సిటీలోని ఓహ్రి సాహిబ్ బార్బీక్యూలో శుక్రవారం ఈ ఫుడ్ ఫెస్ట్ ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఫెస్టివల్‌లో స్ట్రీట్ ఫుడ్ అనుభూతిని కలిగించే విధంగా ఇక్కడి రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన వంటకాలు నోరూరిస్తున్నాయి.

పాత నగర వీధుల్లో కనిపించే పలు రకాల చాట్.. రుచికరమైన వంటకాలు ఈ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పట్టీ సమోసా, మిర్చి బజ్జీ, దహివడా, హలీం, ఫలూడా, మసలా పాపిడితోపాటు రోజు వారి బిర్యాని వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. గత సంవత్సరం కరోనా మహామ్మారి కారణంగా ఇలాంటి రుచికరమైన ఛాట్, డిషెష్ మన నగర వాసులు మిస్ అయ్యారు. ఇలాంటి స్ట్రీట్ అనుభూతిని కలిగిస్తూ ధీమ్‌తో ఈ ఫెస్ట్‌ను ఏర్పాటు చేశామని ఓహ్రీస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..