మహిళతో అసభ్యకర ప్రవర్తన.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్

by  |
arrest
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మహిళతో అర్ధరాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన డోంజో సంస్థ ఫుడ్ డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరమంగలలో అరుణ్ కుమార్, అతని సోదరుడు డొంజో సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. షిఫ్టుల రూపంలో ఓకే ఐడీ కార్డుతో వీరిద్దరూ పని చేస్తున్నారు.

ఈ క్రమంలో మే 31వ తేదీన ఓ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన అరుణ్.. రాత్రి సమయంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను వేధించి.. అక్కడికి నుంచి పారిపోయాడు. దీంతో సదరు మహిళ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అరుణ్‌ను పట్టుకున్నారు. అయితే బైకు, ఐడీ కార్డు ఒక్కటే ఉన్న కారణంగా ముందు నిందితుడి సోదరుడిని అరెస్ట్ చేయగా.. విచారణలో అరుణ్ ఈ వేధింపులకు పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed