- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా సోకి ప్రజాగాయకుడు నిస్సార్ మృతి
<p>దిశ, నల్లగొండ: ప్రముఖ ప్రజాగాయకుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనినేత నేత సుద్ధాల నిస్సార్ కరోనా వైరస్ సోకి మరణించారు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు నిస్సార్. ఆయన పాడిన పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణ ధూంధాం సభల్లో పెద్ద ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూనే తన పాటలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. పేద […]</p>

దిశ, నల్లగొండ: ప్రముఖ ప్రజాగాయకుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనినేత నేత సుద్ధాల నిస్సార్ కరోనా వైరస్ సోకి మరణించారు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు నిస్సార్. ఆయన పాడిన పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణ ధూంధాం సభల్లో పెద్ద ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూనే తన పాటలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. పేద కుటుంబంలో పుట్టిన నిసార్ అనేక పోరాటలకు పాటల ప్రాణవాయువుగా నిలిచాడు. నిసార్ మృతిపై ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి స్పందిస్తూ.. కరోనా వైరస్ సోకిన నిస్సార్ చికిత్స కోసం అనేక ప్రైవేటు ఆస్పత్రులు తిరిగినా.. ఎక్కడా చేర్చుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గాంధీ ఆస్పత్రిలో చేరితే వెంటిలేటర్ సదుపాయం లేక తుది శ్వాస విడిచారంటూ ఆరోపించారు. ఈయూ నేత, రచయిత, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా నిస్సార్ అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.






