మూసీకి ఊహించని భారీ వరద

by  |
మూసీకి ఊహించని భారీ వరద
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిలాల్లోని అతి పెద్ద మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ నదికి చరిత్రలోనే ఎన్నడూ లేనంత వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు వద్ద పరిస్థితి అంతకంతకు ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే 13 గేట్లు ఎత్తి 20 అడుగుల మేర దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతకంటే అదనంగా 1.70 నీటిమట్టంతో 646.70 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వరద ఒక్కసారిగా అతి భారీగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నడూ ఊహించని రీతిలో అతి భారీ వరద కావడంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. సీఈతో సహా ముఖ్య అధికారులంతా ప్రాజెక్టు వద్ద ఉండాలని సూచించారు. మరోవైపు మూసీ ప్రాజెక్టు దిగువన నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.


Next Story

Most Viewed