నిజాంసాగర్ ఆరు గేట్ల ఎత్తివేత

by  |
నిజాంసాగర్ ఆరు గేట్ల ఎత్తివేత
X

దిశ, జుక్కల్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. వరద ద్వారా భారీ నీరు ప్రాజెక్టులోకి చేరడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 కాగా.. ప్రస్తుతం 1,403 చేరింది. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 17టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 17 టీఎంసీలకు చేరువ కావడంతో గురువారం ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు మంజీరకు అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్రావు , ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ దత్తాత్రేయ ఉన్నారు. దిగువ ప్రాంతంలోని మంజీర పరివాహక ప్రాంత ముంపు మండలాల అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.


Next Story

Most Viewed