హియాయత్‎సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి

by  |
హియాయత్‎సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి
X

దిశ, వెబ్‎డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. హైదరాబాద్ జనజీవనం స్తంభించిపోయింది. నగరానికి మంచినీటి అందించే హిమాయత్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టుల 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరోవైపు ఉస్మాన్ సాగర్, మూసీనది ప్రమాదకరంగా మారాయి. నాగారం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో 11 లారీలు, ట్రాక్టర్, సుమో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని సూచించారు.


Next Story

Most Viewed