అ జాగ్రత్త కారణంగా సంతోషం విషాదమైంది..

96

దిశ, లింగాల : వివాహానికి వెళుతున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి బోల్తాకొట్టిన ఘటన గురువారం లింగాల మండల సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణయ్య కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామ శివారులోని మలుపు మైసమ్మ సమీపంలో టాటా ఏస్ వాహనం అదుపు తప్పి కింద పడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. షాయిన్ పల్లి గ్రామానికి చెందిన పలువురు సుమారు 10:30 గంటల సమయంలో అప్పాయిపల్లి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వివాహానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

వాహనంలో సుమారు 10 మంది ఉండగా డ్రైవర్‌తో కలిపి ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ కృష్ణయ్య ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం సహాయంతో లింగాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. ప్రమాదానికి అతివేగమే కారణమని గుర్తించిన పోలీసులు డ్రైవర్ కురుమయ్య పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..