- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఊరు.. వేర్వేరు చోట్ల.. ఐదుగురు గల్లంతు
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్‌మెగ్దా గ్రామంలో ఒకేరోజు వేర్వేరు చోట్ల వాగులో పడి ఐదుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదం గడిచిన సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన రాహుల్ ఠాకూర్(10) అనే బాలుడు సోదరులు కిరణ్, కజిన్ రియాలతో ఆడుకుంటుండగా, వారికి దగ్గర్లో మేత మేస్తున్న పశువులు వారిపైకి దూసుకొచ్చాయి. దీంతో భయాందోళనకు గురైన చిన్నారులు పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. స్థానికులు గమనించి, వెంటనే పోలీసులకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్‌మెగ్దా గ్రామంలో ఒకేరోజు వేర్వేరు చోట్ల వాగులో పడి ఐదుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదం గడిచిన సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన రాహుల్ ఠాకూర్(10) అనే బాలుడు సోదరులు కిరణ్, కజిన్ రియాలతో ఆడుకుంటుండగా, వారికి దగ్గర్లో మేత మేస్తున్న పశువులు వారిపైకి దూసుకొచ్చాయి. దీంతో భయాందోళనకు గురైన చిన్నారులు పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. స్థానికులు గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అంతేగాకుండా అదే గ్రామానికి చెందిన అల్పేష్ షతాజీ (9), అతని సోదరి పూనా(6), విక్రమ్ అనే మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తూ… ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోయారు. దీంతో ఆ ప్రవాహంలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. వారి తల్లిదండ్రులు వలస వచ్చిన వ్యవసాయ కూలీలుగా గ్రామంలో పని చేస్తున్నారు.
Read Also…






