‘ప్రేరణ’గా గార్జియస్ లుక్‌లో బుట్టబొమ్మ

by  |
‘ప్రేరణ’గా గార్జియస్ లుక్‌లో బుట్టబొమ్మ
X

దిశ, వెబ్‌డెస్క్ : బుట్టబొమ్మ ‘పూజా హెగ్డే’ అందం వర్ణించతరమా! సినిమా సినిమాకు మరింత అందాన్ని రంగరించుకుని, అందానికే సొంతూరులా మారుతున్న ఈ సామజవరగమన.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, సూపర్ క్యూట్ స్మైల్‌తో స్క్రీన్‌పై అందాల అరవిందగా కనువిందు చేసే పూజ పుట్టినరోజు పురస్కరించుకుని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రాధే శ్యామ్ టీమ్.

లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ ‘రాధే శ్యామ్’లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న పూజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమాలో ‘ప్రేరణ’గా పూజను ఇంట్రడ్యూస్ చేసింది. లోకల్ ట్రైన్‌లో కూర్చుని ఉన్న ప్రేరణ.. ఎదురుగా కూర్చున్న ప్రభాస్‌తో మాట్లాడుతున్న పిక్ అదిరిపోయింది.

టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకులు కాగా.. భాగ్య శ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్‌లో పూజ గార్జియస్‌గా కనిపిస్తుండగా.. బ్లాక్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా కూర్చున్నాడు ప్రభాస్.

కాగా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కాగా టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed