పూణెలో ఘోర అగ్ని ప్రమాదం.. 500 షాపులు దగ్ధం

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదు వందలకు పైగా షాపులు దగ్ధమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్‌లో చిన్న చిన్న బట్టల దుకాణాలు, గ్రాసరీ షాపుల వంటి వాటికి ఫేమస్. చిరువ్యాపారులు ఎక్కువగా ఉండే ఈ మార్కెట్.. పూణెలో చాలా ఫేమస్ మార్కెట్లలో ఒకటి. pic.twitter.com/TeQ7KlZBrf &mdash; kalpesh Jain (@kalps133) March 26, [&hellip;]</p>

fire accident in pune
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు ఐదు వందలకు పైగా షాపులు దగ్ధమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్‌లో చిన్న చిన్న బట్టల దుకాణాలు, గ్రాసరీ షాపుల వంటి వాటికి ఫేమస్. చిరువ్యాపారులు ఎక్కువగా ఉండే ఈ మార్కెట్.. పూణెలో చాలా ఫేమస్ మార్కెట్లలో ఒకటి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన మంటలను ఆర్పే చర్యలను చేపట్టింది. సుమారు 50 ఫైరింజన్లు మంటలనార్పుతున్నాయి. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ప్రాణనష్టమేమీ సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ చిన్న వ్యాపారులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు.

కాగా, ప్రస్తుత ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చూస్తుండగానే మంటలు విస్తరించడంతో షాపులలో ఉండే వస్తువులన్నీ బూడిదయ్యాయి.

Next Story