- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం విమానాశ్రయం సమీపంలోని గేట్ వే కంటైనర్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కంటైనర్లు దగ్ధం అయ్యాయి. కంటైనర్లలో హానికర రసాయనాలు ఉండటం వల్లే భారీగా మంటలు చెలరేగి.. దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోని ఎల్లపువానిపాలెం ప్రజలు తీవ్ర భయానికి గురవుతున్నారు. ఇటీవలకాలంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం విమానాశ్రయం సమీపంలోని గేట్ వే కంటైనర్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కంటైనర్లు దగ్ధం అయ్యాయి. కంటైనర్లలో హానికర రసాయనాలు ఉండటం వల్లే భారీగా మంటలు చెలరేగి.. దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గర్లోని ఎల్లపువానిపాలెం ప్రజలు తీవ్ర భయానికి గురవుతున్నారు. ఇటీవలకాలంలో విశాఖ సమీపంలోని ఫ్యాకరీల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.
Next Story






