స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

by Shyam |

<p>దిశ, హైదరాబాద్: నగరంలోని హబీబ్ నగర్‌ ఏరియాలో గల ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద సమయంలో దుకాణం లోపల 3 సిలిండర్లు ఉండగా, అందులో ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో పోలీసులు, [&hellip;]</p>

స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, హైదరాబాద్: నగరంలోని హబీబ్ నగర్‌ ఏరియాలో గల ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద సమయంలో దుకాణం లోపల 3 సిలిండర్లు ఉండగా, అందులో ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

Next Story