- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇళ్లన్నీ దగ్గర దగ్గరగా ఉండటంతో నాలుగు ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మూడు ఇళ్లల్లోని గ్యాస్ బండలు పేలడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. దాదాపుగా నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణాజిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇళ్లన్నీ దగ్గర దగ్గరగా ఉండటంతో నాలుగు ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటిగా మూడు ఇళ్లల్లోని గ్యాస్ బండలు పేలడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. దాదాపుగా నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బాధితులంతా కటిక పేదవారిని, ఈ అగ్నిప్రమాదంతో కట్టుబట్టలతో రోడ్డునపడ్డ వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






