ముగ్గురాళ్ల గనిలో ప్రమాదం.. పదిమంది కూలీలు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-05-08 01:34:46  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా కలసపాడులో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లెలోని ఓ గనిలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో పదిమంది కూలీలు మరణించారు. ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. కాగా మరికొందరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురాయి తొలింగించేందుకు క్వారీకి తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని [&hellip;]</p>

ముగ్గురాళ్ల గనిలో ప్రమాదం.. పదిమంది కూలీలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా కలసపాడులో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లెలోని ఓ గనిలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో పదిమంది కూలీలు మరణించారు. ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. కాగా మరికొందరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురాయి తొలింగించేందుకు క్వారీకి తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇప్పటికే ఐదు మృతదేహాలు వెలికితీశారు. రాళ్లకింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అనుమానం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story