- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shocking news : ‘అఖండ’ సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కాలిపోయిన ‘స్క్రీన్’..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తున్న సమయంలోనే ఒక్క సారిగా థియేటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని రవిశంకర్ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. అఖండ మూవీ ఫస్ట్ షో ప్రారంభమైన కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా సౌండ్ సిస్టమ్‌లో మంటలు వచ్చాయి. క్షణాల్లోనే థియేటర్‌లోని స్ర్కీన్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తున్న సమయంలోనే ఒక్క సారిగా థియేటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని రవిశంకర్ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. అఖండ మూవీ ఫస్ట్ షో ప్రారంభమైన కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా సౌండ్ సిస్టమ్‌లో మంటలు వచ్చాయి.
క్షణాల్లోనే థియేటర్‌లోని స్ర్కీన్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఆస్తి, ప్రాణనష్టం తప్పగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






