గంజాయి తరలిస్తున్న కారులో మంటలు.. స్మగ్లర్లు జంప్..!

173

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును, అందులోని గంజాయి పాకెట్లను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. పట్టణ శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈ ఘటన శనివారం వెలుగుచూసింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. కారు మంటల్లో చిక్కుకుందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా షాక్ అయ్యారు. అందులోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, నగరానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కారు ఎవరిది.. నిందితులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..