కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

41
Fire Accident

దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్ రాష్ర్టం, భరూచ్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఝగడియాలోని జీఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలోని యూపీఎల్-5 ప్లాంట్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీని శబ్ధం సుమారు 15 కిలో మీటర్ల దూరం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట భూకంపం వచ్చిందని భావించిన ప్రజలు భారీగా అగ్నికీలలు ఎగిసిపడడం, కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తించారు.

ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి సమీప గ్రామాల్లోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం మంటలను అదుపు చేస్తోంది. ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకువస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..