మూడోరోజు 3 సంస్కరణలు.. 8 ప్రోత్సాహకాలు!

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్: ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం కింద రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను వరుసగా మూడోరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి ప్రకటనలో మొత్తం 8 ప్రోత్సాహకాలు, 3 సంస్కరణలు ఉన్నాయి. ప్రధానంగా మత్స్యశాఖ, పశుసంవర్థక విభాగాలపై కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేశాయి. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా [&hellip;]</p>

మూడోరోజు 3 సంస్కరణలు.. 8 ప్రోత్సాహకాలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం కింద రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను వరుసగా మూడోరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి ప్రకటనలో మొత్తం 8 ప్రోత్సాహకాలు, 3 సంస్కరణలు ఉన్నాయి. ప్రధానంగా మత్స్యశాఖ, పశుసంవర్థక విభాగాలపై కేటాయింపుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేశాయి. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా 11 అంశాలను నిర్మలా సీతారామన్ వివరించారు.

– డెయిరీ పరిశ్రమలు, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఇందుకోసం 11 అంశాల్లో రాయితీలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామని, లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌నీస మ‌ద్దతు ధ‌రతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. రూ. 74,300 కోట్లు చెల్లించామని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు.

– రెండు నెల‌ల్లో ఫ‌స‌ల్ బీమా యోజ‌న కింద రూ. 6,400 కోట్లు రైతుల‌కు ప‌రిహారంగా చెల్లించినట్టు వివరించారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రూ.18,700 కోట్ల నిధుల‌ను రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా అందించినట్టు చెప్పారు.

– పాల సేకరణ విభాగం ప్రస్తుతం దేశంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పాల ఉత్పత్తి 20 శాతం నుంచి 25 శాతం తగ్గినట్లు చెప్పారు. పాడి రైతుల‌కు రూ. 4,100 కోట్ల ప్ర‌యోజనాలు అందాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. వారికి రూ.5 వేల కోట్ల‌తో ప్ర‌త్యేక ప్రోత్సాహకం అందించనున్నట్టు తెలిపారు. ఈ ప్రోత్సాహకంతో 2 కోట్ల మంది పాడి రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు.

– వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 50 శాతం వ్యవసాయం ఇప్పటికీ వర్షపాతం మీదే ఆధారపడిందని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు రూ.10 వేల కోట్లు కేటాయించారు. ప్రధాని పిలుపునిచ్చిన వోకల్ ఫర్‌ లోకల్‌ను సాకారం చేసే దిశగా ఈ కేటాయింపులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోదాంలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం ఉంటుందన్నారు.

– దేశంలోని పశువులు, గేదెలు, మేకలు, పందులు, గొర్రెలకు 100 శాతం వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు కోటి ఆవులు, గేదెలకు ట్యాగింగ్ పూర్తిచేశామని తెలిపారు. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధులను నివారించడానికి టీకా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం రూ.13,343 కోట్లు కేటాయించనున్నారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయించారు.

– ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులకు రూ.9 వేల కోట్లు, రొయ్యల సాగు, చేపల వేటకు రూ.11 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.

– దేశవ్యాప్తంగా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకునే విధంగా తోడ్పాటును కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 2లక్షల సూక్ష్మ, చిన్న సంస్థలకు ఈ ప్రయోజనాలు మేలు చేస్తాయని ఆర్థికమంత్రి అభిప్రాయపడ్డారు.

– అంతర్రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్యం నెరవేరేందుకు జాతీయ స్థాయి చట్టం తీసుకొస్తామని తెలిపారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులకు రైతులు తమ ఉత్పత్తులను అమ్మాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు.

– లాక్‌డౌన్‌ ఆంక్షలతో వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బన్నదని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కూరగాయలు, పండ్ల సరఫరాకు ఆపరేషన్‌ గ్రీన్‌ తీసుకొస్తామన్నారు. రవాణా ఖర్చులు, శీతల గోదాంల రుసుంల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు.

– ఔషధ పంటలకు రూ.4 వేల కోట్లు కేటాయించారు. తేనేటీగల సంరక్షణ కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. నేషనల్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డు ఆధ్వర్యంలో 2.25 లక్షల హెక్టార్లలో ఔషధ పంటలు పండించేలా ప్రోత్సాహిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో ఆ విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ రకమైన చర్యలతో రైతులకు రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

– నిత్యావసరాల చట్టానికి సవరణలు అవసరమని భావిస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ చట్టం నుంచి వంట నూనెలు, బంగాళదుంపలు, పప్పులు, ఉల్లిపాయలు, నూనె గింజలను బయటకు తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించి, వ్యవసాయరంగంలో పోటీ పెరగడానికి ఇది అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రస్తావన

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలను ప్రస్తావించారు. తెలంగాణలోని పసుపు, ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చికి అంతర్జాతీయంగా మార్కెట్ ఉందన్నారు. దేశంలో స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్ల ఏర్పాటు అంశంలో తెలుగు రాష్ట్రాల పస్తావన తెచ్చారు.

Next Story