ఈ-కామర్స్‌ ఎఫ్‌డీఐ విధానంలో సవరణలు కోరిన వ్యాపారుల సంఘం!

by  |
ఈ-కామర్స్‌ ఎఫ్‌డీఐ విధానంలో సవరణలు కోరిన వ్యాపారుల సంఘం!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సంస్థలకు అందే విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించి భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానంలో సవరణలను ప్రకటించాలని కాంఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా(సీఏఐటీ) వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరింది. ఎఫ్‌డీఐ పాలసీ,2018లోని ప్రెస్‌నోట్ 2 స్థానంలో ప్రభుత్వం వెంటనే కొత్త ప్రెస్ నోట్ జారీ చేయాలని వ్యాపారుల సంఘం తెలిపింది. ‘రెండేళ్ల నుంచి దీనిపై అభ్యర్థనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు వచ్చినప్పటికీ, విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు ఎఫ్‌డీఐ చట్టాన్ని, విధానాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని, గత మూడేళ్లలో వారు ఉల్లంఘించిన అంశాలపై అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని’ సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ సీ బార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు.

రిటైల్ వాణిజ్యం నియంత్రణ, పర్యవేక్షణకు సరైన యంత్రాంగాన్ని కలిగి ఉండేలా ఈ-కామర్స్ విధానాలను రూపొందించాలని వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది. భవిష్యత్తు వాణిజ్యానికి కీలకమైన ఈ-కామర్స్ వ్యాపారంలో అవసరమైన పాలసీని కలిగి ఉండటం అవసరం సీఏఐటీ అభిప్రాయపడింది. భారత్‌లో రిటైల్ వాణిజ్యం రూ. 115 లక్షల కోట్ల వార్షిక టర్నోవర్‌ను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో నియంత్రణ తప్పనిసరి అని సీఏఐటీ వివరించింది.

Next Story

Most Viewed