- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామగుండం పీఎస్‌లో ఇండోనేషియన్లపై మరో కేసు
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్‌లో కరోనా వ్యాప్తికి కారణమైన ఇండోనేషియన్లపై రామగుండం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. క్రైం నెంబర్ 32/2020, ఐపీసీ 420, 269, 270, 188, సెక్షన్ 3 ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ -1897, సెక్షన్ 51 (b) డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, సెక్షన్. 14(1)(b), 7, 13, 14(c), ఫారినర్స్ యాక్ట్ -1946 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 14 ఇండోనేషియన్లు ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ట్రైన్‌లో […]</p>

దిశ, కరీంనగర్: కరీంనగర్‌లో కరోనా వ్యాప్తికి కారణమైన ఇండోనేషియన్లపై రామగుండం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. క్రైం నెంబర్ 32/2020, ఐపీసీ 420, 269, 270, 188, సెక్షన్ 3 ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ -1897, సెక్షన్ 51 (b) డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, సెక్షన్. 14(1)(b), 7, 13, 14(c), ఫారినర్స్ యాక్ట్ -1946 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 14 ఇండోనేషియన్లు ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ట్రైన్‌లో ద్వారా రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగి ముసలియా మజీద్‌లో ప్రార్థనలు చేశారు. అనంతరం ఓ వాహనంలో కరీంనగర్ కు వెళ్లారు. కరోనా వైరస్ బారిన పడ్డ విషయం ముందే తెలిసి కూడా రామగుండం ప్రాంతం ప్రజలకు వ్యాపింప జేయాలనే దురుద్దేశంతోనే వారు వచ్చారని రామగుండం సీఐ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు. ఇండోనేషియన్లు కరీంనగర్‌కు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని నేరంగా పరిగణిoచామని కరుణాకర్ రావు వివరించారు. వారికి ఆశ్రయం కల్పించిన మసీదు ఇమామ్ పై కూడా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
Tags: indonesians, file a case, ramagundam, police station






