నా కోడిని చంపేశారు కేసు పెట్టండి.. మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఫిర్యాదు

by Batti.Sumithra |   (  Updated:2021-09-12 06:01:42  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : మనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే న్యాయం కోసం పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కడం సహజం. కానీ ఓ వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు విచిత్రంగానూ, వింతగానూ అనిపించకమానదు. ఇతర దేశాల్లో ఇలాంటి కేసులు సహజమే అయినప్పటికీ మన దేశంలో ఇది చాలా అరుదుగానే చెప్పవచ్చు. ఇంతకూ ఏం జరిగింంటే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌ జిల్లా సింధూరియన్‌ పోలీస్‌ స్టేషన్‌‌కు శనివారం ఓ వ్యక్తి వచ్చాడు. తన కోడికి ఎవరో గుర్తు [&hellip;]</p>

Hen
X

దిశ, వెబ్‌డెస్క్ : మనకు అన్యాయం జరిగిందని అనిపిస్తే న్యాయం కోసం పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కడం సహజం. కానీ ఓ వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు విచిత్రంగానూ, వింతగానూ అనిపించకమానదు. ఇతర దేశాల్లో ఇలాంటి కేసులు సహజమే అయినప్పటికీ మన దేశంలో ఇది చాలా అరుదుగానే చెప్పవచ్చు. ఇంతకూ ఏం జరిగింంటే..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌ జిల్లా సింధూరియన్‌ పోలీస్‌ స్టేషన్‌‌కు శనివారం ఓ వ్యక్తి వచ్చాడు. తన కోడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపేశారని, కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి నేరస్తులను పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. అయితే అతడి ఫిర్యాదును చూసి ఖంగుతిన్న పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. ఆ వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు.. అక్కడి మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు. అందుకే కేసు నమోదు చేశారు పోలీసులు.

పిప్ర కళ్యాణ్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాజ్ కుమార్ భారతి శనివారం సింధూరియన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశాడు. నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని, పోస్ట్ మార్టం చేయించి నిందితుడ్ని పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మనుషులకు చేసినట్టే కోడికి పోస్టుమార్టం చేస్తే నిందితుడిని పట్టుకోవడానికి ఉపయోగపడుతుందని పోలీసులతో వాదించాడు. వచ్చింది మాజీ ఎమ్మెల్యే కుమారుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు నమోదు అనంతరం ఈ ఘటనపై రాజ్‌ కుమార్‌ భారతి మాట్లాడారు. తాను పక్షుల ప్రేమికుడినని పేర్కొన్నాడు. చిలుకలు, పావురాలు, కోళ్లను ఇష్టంగా పెంచుకోవడం సరదా అని తెలిపారు. అయితే తనకు గిట్టని వారు ఎవరో తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కోడికి విషం పెట్టి చంపేశారని వాపోయాడు. అందుకే నిందితులకు శిక్ష పడాలని కేసు పెట్టిపట్టు వివరించాడు. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి తెగ వైరల్ అవుతుంది.

Next Story