వీళ్లసలు టీచర్స్ యేనా.. దానికోసం ఆఫీస్ లోనే ఒకరిపై ఒకరు పడి

by  |
వీళ్లసలు టీచర్స్ యేనా.. దానికోసం ఆఫీస్ లోనే ఒకరిపై ఒకరు పడి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్క రంగంలోనూ ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది.. ఉండాలి కూడా. కానీ, కొన్ని రంగాలలో పోటీ అనేది గొడవలకు దారి తీస్తుంది. నీకంటే నేనే ఎక్కువ అనే బేధాలు తలెత్తినప్పుడు ఎంత చదువుకున్నా ఆ విచక్షణ మరవడం ఖాయం. అందుకు ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన. విద్యార్థులను ప్రగతిపథంలో నడిపించడానికి బేధాభిప్రాయాలు ఉండకూడదని తెలిపే ఉపాధ్యాయులే ప్రమోషన్ కోసం విచక్షణ మరిచి కార్యాలయంలో కొట్టుకున్న ఘటన బీహార్ లో వెలుగు చూసింది. అసహాయంగా ఇద్దరు టీచర్లు కొట్టుకుంటున్న ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళితే.. ఆదాపూర్‌లోని ఒక పాఠశాలలో శివశంకర్‌ గిరి, రింకీ కుమారి లు టీచర్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్ పోస్ట్ భర్తీ చేయాల్సి ఉండగా అనుభవం, అర్హతను బట్టి వీరిద్దరూ ఆ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఒకరిపై ఒకరు తామెంటే తాము అని గొడవపడుతుండగా.. ఇద్దరి అర్హతలను గమనించిన విద్యాశాఖ అధికారులు విద్యార్హతలు తెలిపే సర్టిఫికెట్స్ ను మూడు రోజుల్లో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. దీంతో ఇరువురు ఇటీవల తమ సర్టిఫికెట్స్ ను పట్టుకొని విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరి పత్రాలను ముందు ఇవ్వాలి అనేదానిమీద ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది.

ఇక ఈ ఘర్షణలో రింకీ కుమారి భర్త , శివశంకర్‌ గిరి జుట్టు పట్టుకొని లాగాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు ఒకరిపై ఒకరు పడుతూ కిందపడి మరి కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ గొడవతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. ప్రమోషన్ కోసం ఇద్దరు బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులు ఇలా విచక్షణ మరిచి కొట్టుకోవడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed