- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా మరణాలు మహిళల్లోనే ఎక్కువా?
<p>దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ ఉంది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం దేశవ్యాప్తంగా ప్రతిరోజు 9 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారిలో మగవారితో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉన్నారని గ్లోబల్ హెల్త్ సైన్సెస్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనంలో తేలింది. మే 20 వరకు ఉన్న లెక్కల ప్రకారం కరోనా సోకిన పురుషుల్లో […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ ఉంది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం దేశవ్యాప్తంగా ప్రతిరోజు 9 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారిలో మగవారితో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉన్నారని గ్లోబల్ హెల్త్ సైన్సెస్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనంలో తేలింది.
మే 20 వరకు ఉన్న లెక్కల ప్రకారం కరోనా సోకిన పురుషుల్లో 2.9 శాతం మరణాలుండగా.. మహిళల్లో 3.3 శాతం వరకు ఉన్నట్లు తేలింది. మరణాల రేటు పక్కన పెడితే.. కొవిడ్ బారిన పడినవారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. 66 శాతం మంది పురుషులు కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురికాగా..
మహిళల్లో 34 శాతం మందికి ఈ వైరస్ సోకింది.
అయితే పురుషులైనా, మహిళలైనా.. అధిక వయసు గల వారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు.






