కి‘లేడీ’ కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్‌లో అలా చేస్తూ..(వీడియో)

by  |
కి‘లేడీ’ కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్‌లో అలా చేస్తూ..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మహిళా కానిస్టేబుల్ పాస్‌పోర్ట్ వెరికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా దేవా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రీనా అనే యువతి ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటుండగా వీడియో తీశారు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇలా ఈ వీడియో కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రీనాను విధుల నుంచి తప్పించారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ యమున ప్రసాద్ వెల్లడించారు. రీనా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఆమె చుట్టూ కొందరు పోలీసులు కూడా కూర్చుని ఉండటం గమనార్హం. ఆ వీడియోను గమనిస్తే మరో కానిస్టేబుల్ కూడా ఆమె లంచం తీసుకునేందుకు సహకరించినట్లు తెలుస్తోంది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అసలు సదరు వ్యక్తికి సంబంధించిన పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు, రీనాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పని మరో కానిస్టేబుల్ అనిల్ సింగ్ దేవన్‌కు అప్పగించగా.. రీనా లంచం తీసుకుంటూ దొరికిపోయింది. అనిల్ సింగ్ దేవన్ కూడా రీనాతో పాటు వీడియోలో కనిపించాడు. కేవలం రీనాను మాత్రమే విధుల్లోంచి తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెతో పాటు వీడియోలో ఉన్న దేవన్‌ను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed