- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను నీ కూతుర్ని నాన్నా.. అంటున్నా వదలకుండా తండ్రి అత్యాచారం
<p>దిశ, పటాన్‌చెరు: సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన వాడు, కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. ఈ దారుణ ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమీన్‌పూర్ పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం భార్య తన అన్నకు రాఖీ కట్టడానికి వెళ్ళింది. చిన్న కూతురిని ఇంటివద్దే ఉంచి […]</p>

దిశ, పటాన్‌చెరు: సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన వాడు, కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. ఈ దారుణ ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమీన్‌పూర్ పోలీసుల వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం భార్య తన అన్నకు రాఖీ కట్టడానికి వెళ్ళింది. చిన్న కూతురిని ఇంటివద్దే ఉంచి వెళ్లింది. దీంతో ఇదే అదునుగా భావించిన తండ్రి ఇంటి లోపలనుండి గడియపెట్టి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. కత్తి చూపించి ‘ఎవరికైనా చెప్తే మీ అమ్మను, అక్కలను చంపేస్తా’ అని బెదిరించాడు. బాలిక ఏడుస్తున్నా, నేను నీ కూతుర్ని నాన్న అని చెబుతున్నా వినకుండా బలవంతంగా మైనర్‌పై అత్యాచారం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించామని అమీన్‌పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.
- Tags
- father
- patancheru






